4,175 ఎకరాల్లో ఉద్యానపంటలకు నష్టం

56చూసినవారు
4,175 ఎకరాల్లో ఉద్యానపంటలకు నష్టం
AP: ‘వడగళ్ల వాన కారణంగా వైఎస్‌ఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంటనష్టం జరిగింది. 4,175 ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1,364 మంది రైతులు నష్టపోయారు’ అని అధికారులు సీఎంకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను పరిశీలించినట్లు నివేదించారు. మరోవైపు వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్