వేసవిలో మొక్కలు, చెట్లు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. వేసవిలో అవసరమైన నీటిని అందించాలి. పంటకు సరైన మోతాదులో నీరు అందకపోతే చెట్ల ఎదుగుదల సరిగా లేకపోవడం, మగ గెలలు ఎక్కువగా రావడం, దీనివల్ల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ప్రతి మొక్కకు వేసవిలో సుమారు 200-350 లీటర్ల నీరు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు డ్రిప్ విధానంలో సాగునీరు అందించడమే ఉత్తమమైన విధానం.