డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతూ యువత నిర్వీర్యం అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూస్తాం. నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటేనే యువతకు జాబ్స్ వస్తాయి. చదువులో నాణ్యత విషయంలోనూ కాలేజీలు దృష్టి పెట్టాలి. లేదంటే వాటి అనుమతి రద్దు చేస్తాం' అని సీఎం హెచ్చరించారు.