సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఒకే ఇక్క పాప్‌కార్న్ గింజతో వినూత్న ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె ఒకే ఒక్క పాప్ కార్న్ గింజను తీసుకుంది. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి వేడి చేసింది. పాన్ వేడి అవగానే దానిపై పాప్ కార్న్ గింజను వేసి, ఇలా చాలా సేపు గింజను అటూ, ఇటూ తిప్పుతూ వేడి చేసింది. చివరగా చూస్తుండగానే గింజ పేలిపోయి పాప్‌కార్న్‌లా మారి పక్కన పడిపోతుంది.