తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగవ రోజు ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఎర్రవల్లిలోని నివాసంలో శుక్రవారం నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలపై నేతలతో చర్చనున్నారు. వరంగల్ మహాసభకు సంబంధించిన అంశాలపై వివరించనున్నట్లు సమాచారం. అలాగే, ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.