వరంగల్ నగరంలో పట్టపగలే హత్య జరిగింది. ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కారులో పెట్టిన ఘటన కలకలం రేపింది. దుండగులు కాళ్లకు తాళ్లు కట్టి మరీ హత్య చేసినట్లు సమాచారం. కారులో మృతదేహాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన బ్యాంక్ ఉద్యోగి రాజా మోహన్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.