తమిళనాడులో డీఎంకే పార్టీకి చెందిన మంత్రికి ఘోర అవమానం జరిగింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన ఆయనపై స్థానికులు బురద చల్లారు. తుఫాన్ వల్ల విల్లుపురంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి పొన్ముడితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. బురద చల్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.