తెలుగు రాష్టాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగిసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున మూడు.. బీఆర్ఎస్, సీపీఐ తరఫున ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. ఏపీలో NDA కూటమి అభ్యర్థులుగా బీదా రవిచంద్ర, కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.