TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. సరస్వతిగూడ గ్రామానికి చెందిన సుధాకర్ (34) అదే గ్రామానికి చెందిన శశికళకు గతంలో కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అయితే శనివారం శశికళ ఇంటికి వెళ్లి డబ్బు తిరిగి ఇవ్వాలని సుధాకర్ కోరాడు. ఈ విషయంలో ఆయనతో శశికళ, ఆమె తమ్ముళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శశికళ, సుధాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సుధాకర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా శశికళ తమ్ముళ్లు దారికాచి అతడిని హత్య చేశారు.