ప్రయాణీకుల భద్రత మరిచి ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన ఓ డ్రైవర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై పుణె మార్గంలో ఎంఎస్ఆర్టీసీ ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్ ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. ఈ ఘటనను గమనించిన ఓ ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో పై స్పందించిన అధికారులు అతనిని విధుల నుంచి తొలగించారు.