ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వ్యవస్థాపక ఛైర్మన్ నార్నే రంగారావు సతీమణి డాక్టర్ శాంతారావు తన ఉదారతను చాటుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లకు ఆమె రూ.కోటి విరాళం అందజేశారు. తన భర్త జ్ఞాపకార్థం ఆదివారం ఆమె సీఎం చంద్రబాబును కలిసి రూ.1,00,01,016 విరాళం చెక్కును అందజేశారు. గతంలో 'అన్న క్యాంటీన్'కు రూ.కోటి విరాళం ఇచ్చి నారా భువనేశ్వరి తనకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.