ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యారు. తొలి ఓవర్లో ఖలీల్ అహ్మద్ వేసిన మూడో బంతికి రవిచంద్రన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి RR స్కోర్ 9/1గా ఉంది. నితీష్ రాణా (4), సంజు (0) క్రీజులో ఉన్నారు.