యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మార్చి 28న గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీ రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్‌బస్టర్ మ్యాక్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇవాళ, రేపు కూడా సెలవులు ఉండటంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.