వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్ల కోసం భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్) కోటా, వసతి టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది. మార్చి 24న ఉదయం 10 గంటల నుంచి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం వసతి టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.