సోమాలియాలో ఓ విమానం కుప్పకూలింది. కెన్యాకు చెందిన DHC-5D బఫెలో కార్గో విమానం మొగదిషు వద్ద ఒక్కసారిగా కూలిపోయింది. ధోబ్లే నుంచి మొగదిషుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. విషయం తెలుసుకన్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.