BRS నేత నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూల్చివేత పూర్తి అయింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో బీఆర్ఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య 5 అంతస్తుల భవనం నిర్మించారు. పొక్లెయిన్ తో 5 గంటల పాటు అధికారులు కూల్చివేతలు జరిపారు. భవనం కుప్పకూలుతున్న సమయంలో పొక్లెయిన్ పై భవన శిథిలాలు పడ్డాయి. చాకచక్యంగా వ్యవహరించడంతో అపరేటర్ కు ప్రమాదం తప్పింది.