కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

67చూసినవారు
కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
జగిత్యాల జిల్లాలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది. గురువారం నుంచి ఉత్సవాలు జరుగుతుండగా ఈవాళ పెద్ద హనుమాన్‌ జయంతి నేపథ్యంలో మాలదారులు, భక్తులు ఆలయానికి పోటెత్తారు. జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొండపైకి చేరుకునేలా నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.