వృద్ధ దంపతులను కింద పడేసి దాడి.. వీడియో వైరల్

55చూసినవారు
యూపీలోని దేవారియాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే వృద్ధ దంపతులను కింద పడేసి దారుణంగా కొట్టాడు. వృద్ధులని కూడా కనికరించకుండా విచక్షణ రహితంగా కాలితో తన్నడంతో వారు కిందపడిపోయారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో వీడియోను చూసిన నెటిజన్లు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్