నాలుగు మినార్‌లు కలిగిన కట్టడం కావడంతో దీనిని ఛార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించింది. నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలలో ఉన్న నాలుగు మినార్‌ల ఎత్తులను నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఛార్మినార్‌ను నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కూడా 4వ కుతుబ్ షాహీ రాజు కావడం విశేషం.