AP: ఏలూరు జిల్లా నూజివీడు పోతురెడ్డిపల్లికి చెందిన వ్యవసాయ కూలీ మందపాటి సాంబశివరావు, శివ రంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు సురేశ్ (17) పుట్టుకతోనే వికలాంగుడు. దీంతో సురేశ్ మంచం పాలయ్యాడు. 17 ఏళ్ళ నుంచి తన కొడుకు పింఛన్ కోసం పలుమార్లు అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన కొడుకుకి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.