సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసుపై మంగళవారం విచారణ చేపట్టనున్నారు. తెలంగాణ స్పీకర్ తరఫున సోమవారం సుప్రీంకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదని అనడం సరైందికాదని, అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. స్పీకర్ ను ఆశ్రయించిన వెంటనే కోర్టును ఆశ్రయించారని, పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కౌంటర్ దాఖలు చేశారు.