ఇవాళ్టి నుంచి అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత పర్యటన

71చూసినవారు
ఇవాళ్టి నుంచి అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత పర్యటన
భారత్‌లో ఇవాళ్టి నుంచి అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ పర్యటించనున్నారు. ఈనెల 29 వరకు కొనసాగే టూర్‌లో ఆయన భారతి వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్‌తో సమావేశమై చర్చలు జరుపుతారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుపడుతున్న నేపథ్యంలో లించ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పరస్పర సుంకాలపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని భారత్ ఆయన్ను కోరే అవకాశముంది.

సంబంధిత పోస్ట్