సైబర్ మోసాలను నిరోధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) తాజాగా హెచ్చరిక జారీ చేసింది. *401# తర్వాత ఎలాంటి అపరిచిత మొబైల్ నంబర్‌కు డయల్ చేయవద్దని భారత టెలికమ్యూనికేషన్స్ ప్రజలకు సూచిస్తోంది. అలా చేయడం ద్వారా అపరిచిత వ్యక్తుల మొబైల్ నంబర్‌లో నిరంతరాయంగా కాల్ ఫార్వార్డింగ్ యాక్టివ్ అవుతుంది. మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. *401# డయల్ ఉన్నట్లయితే వెంటనే డిలిట్ చేయండి.