మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శృంగారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య బంధంగా దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ రొమాంటిక్ గా ఆనందంగా సాగాలన్నా శృంగారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే అందరూ తమ పార్ట్నర్ తో లైఫ్ అంతా రొమాంటిక్ గా సాగిపోతే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటూ ఉంటారు తప్ప.. వాటిని ఆచరణలో మాత్రం పెట్టరు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఇలాంటివి చాలా కష్టంగా అనిపిస్తాయి. మరోవైపు పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఆ కార్యం వైపు అస్సలు ఆసక్తి చూపరు. అయితే, ఇలాంటి సమస్యలన్నింటికీ బెడ్ రూమ్ లోనే పరిష్కారం వెతుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, సాధారణంగా స్త్రీల కంటే పురుషులే శృంగారంలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారని అందరూ భావిస్తుంటారు. కానీ, తీవ్ర పని ఒత్తిడి, ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది పురుషులు శృంగారం పట్ల ఆసక్తి కోల్పోతుంటారు. ఇటువంటి సందర్భంలో మహిళలు తమ భాగస్వామిని ఆకర్షించడానికి, వారిని శృంగారానికి సిద్ధం చేయడానికి ఈ కింది చిట్కాలను పాటించండి. వారిని రతి క్రీడకు సిద్ధం చేయండి.
మీ భర్త దృష్టిని ఆకర్షించడానికి మీరే ముందుగా చొరవ తీసుకోండి. అతడిని మీ చూపులతో ఆకర్షించి బెడ్ పైకి తీసుకెళ్లండి. అతను శృంగారం ప్రారంభించే వరకు వేచి చూడకుండా మీరే చొరవ తీసుకొని శృంగారాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ఎల్లప్పుడూ భర్తలే భార్యలను ఆకర్షించి శృంగారానికి సిద్ధం చేయడం అనేది వారికి కొంత విసుగు తెప్పిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామి మానసిక స్థితిని ఎంత త్వరగా మారుస్తుందో మీరే చూడండి. మీ భాగస్వామి ఒత్తిడి గురవుతూ శృంగారానికి విముఖత చెప్పిన సందర్భంలో వారిని మూడ్లోకి తీసుకురావడానికి మసాజ్ చేయడం గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది. మాసాజ్ చేయడం అనేది వారి మానసిక స్థితిలో మార్పు తెచ్చి శృంగారానికి సిద్ధం చేస్తుంది. మీ చేతి స్పర్షతో వారిలో శృంగార కోరికలు కలుగుతాయి. అంతేకాక, సెక్సీగా దుస్తులు ధరించడం కూడా మీ భాగస్వామిలో శృంగార వాంఛ కలగడానికి ఉపయోగపడుతుంది.
మీ జీవిత భాగస్వామిని లైంగికంగా ప్రేరేపించడానికి ఇది ఉత్తమ మార్గంగా పనిచేస్తుంది. మీరిద్దరూ రతి కార్యంలో లీనమైపోవడానికి శబ్దాలు చేయడం, అతని చెవుల్లో గుసగుసలాడటం వంటివి బాగా ఉపయోగపడతాయి. ఈ చర్యల ద్వారా వారిలో శృంగార వాంఛ రెట్టింపు చేయవచ్చు. దీంతో పాటు, మీ భాగస్వామి కోరికలను అడగడం, మీ కోరికలను వారికి తెలియజేయడం వంటివి చేయండి. మీ భాగస్వామిలో శృంగార కోరికలు రగిలించడానికి మీరు అతని ఫోన్‌ను సెక్సీ సందేశాలను పంపించండి. పురుషులు మహిళల వేశాధారణ చూసి ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే, మీరు ప్రతి రోజు ఒకే విధంగా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే, మీ భర్త ప్రతిరోజూ మిమ్మల్ని ఒకేలా చూడటం అలవాటు చేసుకుంటాడు. మీలో ఎటువంటి కొత్తదనం కన్పించకపోవడంతో శృంగారం పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అందువల్ల, మీ భర్తలో శృంగార కోరికలు రగిలించడానికి సెక్సీగా రెడీ అవ్వండి. కొంచెం లైట్ మేకప్ వేసి సెక్సీ లుక్ తో వారిని ఆకట్టుకోండి. ఇలా చేస్తే మీ భాగస్వామి మీతో పడకగదిలో చాలా సమయం వెచ్చిస్తాడు. తద్వారా శృంగార కార్యంలో అమితానందం పొందుతారు. షవర్ కింద స్నానం చేయడానికి వెళ్లినప్పుడు మీ భాగస్వామిని ఆకర్షించండి. మీరిద్దరూ కలిసి స్నానం చేయాడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం మూలాన మీ ఇద్దరి మధ్య ముద్దుల తో రతి కార్యం ప్రారంభమై, అది చివరికి శృంగారానికి దారితీస్తుంది. ఎప్పుడూ పడకగదిలో శృంగారం చేయకుండా ఇలా డిఫరెంట్ గా ప్రయత్నిస్తే అమితానందం పొందవచ్చు.