బంగారులేడి రూపంలో వచ్చిన మారీచుడు రాముడిలా అరిచి ప్రాణాలు విడుస్తాడు. రాముడికే అపకారం జరిగిందనుకుని సీతమ్మ తల్లి లక్ష్మణుడిని వెళ్లమంటుంది. ఆ సమయంలో లక్ష్మణుడు ఓ గీత గీసి దాటొద్దని సీతమ్మకు చెప్పాడని, దానినే లక్ష్మణరేఖ అంటారని చెబుతారు. వాస్తవానికి వాల్మీకి రామాయణంలో అసలు లక్ష్మణరేఖ గురించి ప్రస్తావనలేదు. లక్ష్మణుడు 'తల్లి నువ్వు క్షేమంగా ఉండాలి నిన్ను వనదేవతలు కాపాడాలి' అని చెప్పి వెళ్లిపోయాడు.