భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన 'ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్' నిలిచింది. ఈ వంతెనను ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా షెవా ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించారు. దీని పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెనను సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.21,200 కోట్లు ఖర్చు పెట్టారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.