భూకంప తీవ్రతను,
భూకంపం సంభవించిన చోట దాని ప్రభావాన్ని కొలిచే స్కేల్‌ను మెర్కలీ స్కేలు అంటారు. దీన్ని 1931లో ఇటలీకి చెందిన మెర్కలీ అనే శాస్త్రవేత్త రూపొందించారు. అయితే ఆధునిక కాలానికి అనుగుణంగా దీన్ని ఆధునీకరించడంతో మోడిఫైడ్ మెర్కలీ స్కేలుగా పిలుస్తున్నారు. సాధారణంగా ఈ స్కేలులో 12 పాయింట్లు ఉంటాయి. ఇది ప్రజల మీద, నిర్మాణాల మీద, భూఉపరితలం మీద, భూకంప ప్రభావ తీవ్రతను తెలియజేస్తుంది.