శాస్త్రవేత్తలు ప్రయోగాల్లో భాగంగా అంతరిక్షంలోకి ఇప్పటివరకు కోతులు, చింపాంజీలు, కప్పలు, తాబేళ్లు, చేపలు, సాలెపురుగులు, కుందేళ్లు, బొద్దింకలు, కుక్కలు, ఎలుకలు, ఈగలు వంటి అనేక జీవులను పంపారు. అంతరిక్షంలోకి మొట్టమొదటిగా పంపబడిన జీవులు ఈగలు. 1947లో అమెరికా వీటిని పంపింది. తర్వాత 1949లో ఆల్బర్ట్ అనే పేరు గల రీసస్ను రోదసిలోకి పంపగా, 134 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన ఆ కోతి తిరిగి భూమిపైకి వస్తుండగా మరణించింది.