AP: ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది. ఆ ఆలయాల్లో సీతారామలక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా దర్శనమిస్తాడు. హనుమంతుడు లేని రామాలయం ఉండదనేది పెద్దల మాట. కానీ హనుమంతుడు లేని రామాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి ఉండరు. ఆంజనేయస్వామిని కలవకముందే ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని నానుడి. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెప్పే మాట.