తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనకు సమయం పట్టే అవకాశం ఉంది. తమిళనాడు, AP, కర్ణాటక, TG రాష్ట్రాలకు అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది. ఒకేసారి దక్షిణ భారతదేశ రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించనుందని, అందుకే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వివాదం ఉండటంతో వీటిని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాతే పార్టీ అధ్యక్షుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.