జాతీయస్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించారు అరుణిమా సిన్హా. రైలులో దొంగలను అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలిగా చరిత్ర సృష్టించారు.