ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 మూవీ ఈ నెల 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం యూసుఫ్‌గూడలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌కు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.