కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేబీ పార్ధివాలా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అనుసరించిన తీరును చూస్తుంటే తన 30 ఏళ్ల కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ (నాన్ మెడికల్) ప్రవర్తన సందేహాస్పదంగా ఉందని, ఆమె ఎందుకిలా ప్రవర్తించారు అని ఆయన ప్రశ్నించారు.