రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?: బీజేపీ ఎంపీ

51చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంలో కట్టుకున్న ఇండ్లకు రెగ్యులర్ చేసుకోవడానికి కేసీఆర్ సాయం చేయ‌టానికి జీవో 58, 59 ఇచ్చార‌ని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఇండ్లు కూల్చడం తప్ప ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా? లేదా? మంత్రులు పని చేస్తున్నారా? లేదా? అని అన్నారు. అధికారులు మంత్రులు చెప్పినట్టు వింటున్నార‌ని ఎంపీ ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్