స్నేహానికి హద్దులు లేవు.. అంతరాలు అంతకంటే ఉండవు. నిజాయితీతో కూడుకున్న స్నేహం జీవితాంతం అన్ని సమయాల్లో తోడుగా నిలబడుతుంది. ప్రతిఒక్కరికి స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితుల వల్ల మంచే జరుగుతుంది. అందుకోసం మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. ముఖ్యంగా స్నేహానికి.. ప్రేమకు సంబంధం లేదు. స్నేహితుల ముసుగులో చెడుసావాసాలు చేయడం మంచిది కాదు.