ఆవు పాల కంటే ఎక్కువ ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, తక్కువ లాక్టోస్ మేకపాలలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 'మేక పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు మేకపాలు తాగడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. మేక పాలను తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. వారికి మేక పాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.' అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.