జగిత్యాల జిల్లా వెల్గటూర్ బస్టాండ్ దగ్గర గురువారం సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో డ్రైవర్ బస్సును ఆపేసారు. బస్సులో స్థలం లేకపోయినా ఎక్కి ఫుట్ బోర్డుకు వేలాడుతున్నారని, ప్రయాణికులకు ఏదైనా జరిగితే తన ఉద్యోగం పోతుందని డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని దయచేసి కొంత మంది దిగాలని డ్రైవర్ ప్రయాణికులను కోరారు