మద్యం మత్తులో డ్రైవింగ్‌.. SR నగర్‌లో షాపులోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

82చూసినవారు
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో కొనుగోలు దారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో షాపు బయట పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించినట్టు గుర్తించారు.

సంబంధిత పోస్ట్