దసరా సందర్భంగా కోల్‌కతా నగరమంతా సినిమా సెట్టింగులను తలపించే పెద్ద పెద్ద పెండాళ్లు(మండపాలు) ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క మండపానికి ఒక్కో ప్రత్యేక థీమ్ ఉంటుంది. ‘బొనెది బరీ’ పేరుతో కోల్‌కతాలో ఉండే రాజభవనాల్లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒడిశాలోని భునేశ్వర్‌లో కూడా ఇదే తరహాలో వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే మండపాల మధ్య పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఏర్పాటుచేసే అమ్మవారి విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది.