హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలతో నిండిపోయే ప్రదేశం కులు. ఇక్కడ జరిగే దసరా వేడుకలు వేరే లెవల్‌లో ఉంటాయి. దేశమంతా పది రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం దసరా పదవ రోజు నుంచి ఒక వారం పాటు జరుపుకుంటారు. దసరా రోజు రావణ దహనం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం దేవతలను వారం రోజుల పాటు ఊరేగిస్తారు. ఆటపాటలతో సంబరాలు మారుమోగిపోతాయి.