అసోం, ఉత్తరాఖండ్, హిమాచల్‌చల్ ప్రదేశ్‌లో ప్రకంపనలు నమోదయ్యాయి. అసోం తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం వేకువ జామున 5.55 గంటలకు 3.4 తీవ్రతతో
భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. అంతకు ముందు ఉత్తరాఖండ్ భాగేశ్వర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత 12.47 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్‌లో 2.7 తీవ్రతతో భూమి కంపించింది.