దంపుడు బియ్యంతో చేసిన ఆహారం తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దంపుడు బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. దంపుడు బియ్యం తింటే షుగర్ తగ్గుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలకపాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 వీటిల్లో చాలా ఎక్కువని చెబుతున్నారు. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు.