వైసీపీ హాయాంలో పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం 24 వేల ఫామ్-7 దరఖాస్తులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు పురోగతి నివేదికను ఈసీకి కూడా నివేదించాలన్నారు. కేసు దర్యాప్తులో ఎవరినైనా అరెస్టు చేసేందుకు, సోదాలు చేపట్టేందుకు సిట్‌కు పూర్తి అధికారాలిచ్చారు. ఈ మేరకు సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.