గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. రక్తపోటును నియంత్రించి, గుండె జబ్బులను తగ్గిస్తాయి. పురుషులలో ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మంచి నిద్రకు దోహదపడుతుంది.గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.