కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంట్‌కు సమర్పించనుంది. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో, 2 గంటలకు రాజ్యసభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టబోతున్నారు.