నేటి నుంచి టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్

65చూసినవారు
నేటి నుంచి టెట్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్
తెలంగాణ ఉపాద్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాగా ఇదివరకే అప్లై చేసిన వారి దరఖాస్తుల సవరణకు నేటి నుంచి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాల్టి నుంచి ఈనెల 20 వరకు తమ దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 9వ తేదీ నాటికి 1,93,135 దరఖాస్తులు రాగా, గతంతో పోల్చితే అప్లికేషన్లు తక్కువగా రావడంతో గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్