తెలంగాణలో 4 ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని BRS నేత హరీశ్ రావు చెప్పారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఓ వైపు చంద్రబాబు ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడుగుతున్నారని, గోదావరి నీళ్లను పెన్నాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టనట్లుగా ఉంటుంది' అని దుయ్యబట్టారు.