కరెంట్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి.. 4 గంటలు స్తంభం పైనే

50చూసినవారు
కరెంట్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి.. 4 గంటలు స్తంభం పైనే
అదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడం కోసం మోతిరాం (38) అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ స్తంభం ఎక్కగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ శాఖ నిర్యక్ష్యంతోనే మోతిరాం చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో మృతదేహం 4 గంటల పాటు స్తంభం పైనే ఉంది. మోతిరాం తమకు చెప్పకుండా పోల్ ఎక్కాడని, చివరకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్