టీమ్ మీటింగ్ అంటే అంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోతారు. అయితే ఓ యువతి మాత్రం టీమ్ మీటింగ్‌లో డ్యాన్స్ చేసింది. ఓ బాలీవుడ్ పాటకి అదుర్స్ అనిపించేలా స్టెప్పులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె డ్యాన్స్ చూసిన వెంటనే తోటి ఉద్యోగులంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టి ప్రశంసించారు. ఇది ఎక్కడ జరిగిందో గానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. టీమ్ మీటింగ్స్‌లో ఇలాంటి క్రియేటివిటీ కచ్చితంగా ఉండాలంటున్నారు.