ప్రతీ పీజీ వైద్య విద్యార్థికి నెలకు రూ.50 వేల నుంచి లక్ష వరకూ స్టైపెండ్ కాలేజీ యాజమాన్యం చెల్లించాలి. కానీ చాలామేర కళాశాలలు ఈ సొమ్ము చెల్లించడం లేదు. పలు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రతినెలా మొదటివారంలో పీజీ విద్యార్థి పేరుతో బ్యాంకు ఖాతాలో స్టైపెండ్ జమచేస్తూ.. వెంటనే విద్యార్థి సంతకంతో ముందే తీసుకున్న చెక్‌ను డిపాజిట్ చేసి ఆ సొమ్మును వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో రికార్డుల్లో మాత్రం స్టైపెండ్ ఇచ్చినట్లు ఉంటుంది తప్ప విద్యార్థులకు అందడం లేదు.